కులగణన పేరుతో కాంగ్రెస్ నేతలు కుటిల రాజకీయాలు : హరీష్ రావు

Telugu Lo Computer
0


కులగణన పేరుతో కాంగ్రెస్ నేతలు కుటిల రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజమెత్తారు. కులగణన సర్వేలో పాల్గొనని వారిని సమాజం నుంచి బహిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను హరీశ్ రావు తిప్పి కొట్టారు. ఈమేరకు 'ఎక్స్' వేదికగా విమర్శలు చేశారు. కేసీఆర్ కు సమాజంలో జీవించే హక్కు లేదని రేవంత్ అంటున్నారు. తెలంగాణను ఆవిష్కరించిన కేసీఆర్ ను బహిష్కరిస్తారా? సమాజంలో జీవించే హక్కు ఎవరికి లేదో ప్రజలను అడుగుదామా? కొడంగల్ లేదా కొండారెడ్డిపల్లిలో అడుగుదామా? రాహుల్ గాంధీ మీద కోపాన్ని కేసీఆర్ మీద చూపిస్తే ఎట్లా? తెలంగాణ గతిని మార్చిన కేసీఆర్ స్థానం ప్రజల గుండెల్లో పదిలం. రేవంత్ ఇలాగే మాట్లాడితే సమాజంలో ఉండటానికి అర్హుడు కాదు. మా బహిష్కరణ కాదు.. రేవంత్ నిష్ర్కమణకు సమయం వస్తోంది. బహిష్కరించాల్సి వస్తే ప్రజలను మోసం చేసిన సీఎంను చేయాలి. ముఖ్యమంత్రిగా ఎవ్వరూ గుర్తించడం లేదని ఉనికి చాటుకోవడానికి కేసీఆర్పై ప్రేలాపనలా? కేసీఆర్ను తిడితే ఒక్క రోజు హెడ్ లైన్స్ లో ఉంటావేమో కానీ తెలంగాణ చరిత్ర గతిని మార్చిన కెసీఆర్ స్థానమే ప్రజల హృదయాల్లో పదిలం అని హరీశ్ రావు అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)