తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 904 సహకార సంఘాలు కాల పరిమితితో పాటు 9 డీసీసీబీ చైర్మన్ల పదవి కాలాన్నీ మరో ఆరు నెలలు పొడిగిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పాలక వర్గ పదవీ కాలానికి 6 నెలల ముందే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతోంది. కానీ ఫిబ్రవరి 15వ తేదీ సమీపానికి వచ్చినా.. ఇంత వరకు రాష్ట్ర సహకార సంఘాల రిజిస్ట్రార్ నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. దీంతో సహకార సంఘాల కాలపరిమితిని మరో ఆరు నెలలు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఫిబ్రవరి 11వ తేదీన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలక వర్గాల పదవి కాలం పొడిగించాలంటూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును డీసీసీబీ చైర్మన్లు కలిసి విజ్జప్తి చేశారు. ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. ఫిబ్రవరి 15వ తేదీతో తమ పదవి కాలం ముగియనుండగా.. ఇంత వరకు సహకార సంఘాల రిజిస్ట్రార్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.
సహకార సంఘాల పదవీ కాలం పొడిగించిన తెలంగాణ ప్రభుత్వం !
February 14, 2025
0
Tags