మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ స్థల కేటాయింపు కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు, ఆయన భార్య, మరో ఇద్దరికి ఆధారాలు లేవని పేర్కొంటూ లోకాయుక్త క్లీన్ చిట్ ఇచ్చింది. దర్యాప్తులో ఎటువంటి నేరపూరిత చర్య జరగలేదని తేలింది. దర్యాప్తులో ఆరోపణలు సివిల్ స్వభావం గలవని.. క్రిమినల్ చర్యలు అవసరం లేదని తేల్చారు. ఈ కేసుకు సంబంధించి సిద్ధరామయ్య, ఆయన భార్య పార్వతిపై వచ్చిన అభియోగాలకు తగ్గ సాక్ష్యాలు లేని కారణంగా నేరు రుజువు చేయలేకపోయినట్లు తుది నివేదికను కర్ణాటక హైకోర్టుకు సమర్పించినట్లు విచారణలో పాల్గొన్న అధికారులు వెల్లడించారు. ఈ కేసులో వచ్చిన ఆరోపణలకు సాక్ష్యాధారాలు లేని కారణంగా నేరం రుజువు కాకపోవడంతో తుది నివేదికను కోర్టుకు సమర్ఫిస్తున్నట్లు లోకాయుక్త పోలీసులు ముడా కేసులో ఫిర్యాదుదారు అయిన సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణకు లేఖలో వెల్లడించారు. ముడా స్థల కేటాయింపులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఇతరులు అవకతవకలకు పాల్పడ్డారని ఫిర్యాదులో ఆరోపించారు. భారత శిక్షాస్మృతి, అవినీతి నిరోధక చట్టం, బినామీ లావాదేవీల (నిషేధం) చట్టం, కర్ణాటక భూ కబ్జా చట్టంలోని అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే, లోకాయుక్త దర్యాప్తులో ఎటువంటి క్రిమినల్ తప్పు జరగలేదని తేలింది. అందువల్ల నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ తుది నివేదిక సమర్పించబడింది. క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ 2016, 2024 మధ్య ముడా చేసిన పరిహార భూకేటాయింపులను ఇప్పటికీ దర్యాప్తు చేస్తామని లోకాయుక్త తెలిపింది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు. తదుపరి దర్యాప్తు అనంతరం సీఆర్పీసీ సెక్షన్ 173(8) కింద మరొక నివేదిక కోర్టుకు సమర్పించబడుతుంది.
ముడా స్కాంలో సిద్ధరామయ్యకు లోకాయుక్త క్లీన్ చిట్ !
February 19, 2025
0
Tags