డబ్ల్యూటీఓలో 'టీ' అంటే ట్రంప్‌ కాదనే విషయాన్ని ట్రంప్ కాదనే విషయాన్ని మోడీ గుర్తుచేయాలి !

Telugu Lo Computer
0


ప్రపంచ దేశాలు పరస్పర సుంకాలు విధించుకోవడం అనేది అంతర్జాతీయ వాణిజ్య సూత్రాలకు పూర్తి విరుద్ధమని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ అన్నారు. డబ్ల్యూటీఓ (ప్రపంచ వాణిజ్య సంస్థ)లో టీ అంటే ట్రంప్ కాదనే విషయాన్ని మోడీ తన స్నేహితుడు ట్రంప్‌నకు గుర్తు చేయాలని సవాల్‌ చేశారు. అమెరికా విధిస్తున్న పరస్పర సుంకాలపై మరో కాంగ్రెస్ నేత పవన్ ఖేడా ఐదు ప్రశ్నలు వేశారు. 

* అమెరికా నుంచి దిగుమతులు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో శ్రామికశక్తిలో 45.76 శాతంగా ఉన్న రైతుల ప్రయోజనాలను ఎలా కాపాడడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటోంది? 

* రైతులకు మద్దతును అందించడానికి కనీస మద్దతు ధర చట్టబద్ధతలో మార్పులను ప్రభుత్వం ఇప్పుడైనా పరిశీలిస్తుందా?

* అమెరికా నుంచి దిగుమతయ్యే వ్యవసాయ ఉత్పత్తులకు భారత్‌ డంపింగ్‌ యార్డ్‌గా మారకుండా నిరోధించడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటోంది?

* విదేశీ ఉత్పత్తుల నుండి పెరిగిన పోటీ కారణంగా ప్రభావితమయ్యే ఎంఎస్‌ఎంఈ రంగాన్ని రక్షించడానికి ప్రభుత్వం ఎటువంటి ప్రణాళికలు చేస్తోంది?

* భారత జీడీపీపై పరస్పర సుంకాల ప్రభావం ఏమిటి?

తమ దిగుమతులపై సుంకాలు విధించే అన్ని దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ఇప్పటికే పలుమార్లు పేర్కొన్నారు. అమెరికా దిగుమతులపై ఏ దేశాలు సుంకాలు వసూలు చేసినా తిరిగి ఆయా దేశాలపై సుంకాలు వసూలు చేస్తామని అన్నారు. అలాగని ఎక్కువ తక్కువ కాకుండా.. ఆయా దేశాలు మాకు ఎంత సుంకం విధిస్తుందో దానికి తగ్గట్లే తాము విధిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది వాణిజ్య యుద్ధం కాదని అన్నారు. ఇక, ఈ పరస్పర పన్నుల విధానంలో భారత్‌కు ఎలాంటి మినహాయింపు లేదని ట్రంప్‌ పేర్కొన్నారు. ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్రంప్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే ఆయన ఈ విషయంపై స్పష్టతనిచ్చారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)