ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ బెస్ట్ చీఫ్ మినిస్టర్ సర్వేలో చంద్రబాబుకు నాల్గో స్థానం !

Telugu Lo Computer
0


ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ బెస్ట్ చీఫ్ మినిస్టర్ సర్వేలో ఏపీ సీఎం చంద్రబాబు నాల్గో స్థానంలో నిలిచినట్లుగా టీడీపీ ట్వీట్ చేసింది. గత సంవత్సరం ఆగస్టులో ఐదవ స్థానంలో ఉన్న ఆయన తాజాగా నిర్వహించిన సర్వేలో ఐదవ స్థానాన్ని పొందినట్లుగా పేర్కొన్నారు. మొదటి మూడు స్థానాలలో వరసగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఉండడం గమనార్హం. ఇక ఐదు, ఆరవ స్థానాలలో ఫడ్నవిస్, సిద్ధ రామయ్య నిలిచారు.  ఎంకే స్టాలిన్, చంద్రబాబు మధ్య కేవలం 0.1 శాతం మాత్రమే తేడా ఉండడం విశేషం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నో స్థానంలో ఉన్నారనే విషయాన్ని మాత్రం తెలియజేయలేదు. లోక్ సభ ఎన్నికలకు ముందు నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేను పోలిస్తే సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రజాధరణ పరంగా 12 శాతం పాయింట్లు భారీగా తగ్గినట్లుగా వెల్లడైంది. అప్పుడు చేసిన సర్వేలో దాదాపు 51 శాతం మంది సీఎం ఆదిత్యనాథ్ పనిపట్ల సంతృప్తిగా ఉన్నట్లుగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ సంఖ్య 39 శాతానికి పడిపోయింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)