తెలంగాణ ప్రభుత్వంతో గూగుల్‌ అవగాహన ఒప్పందం !

Telugu Lo Computer
0


హైదరాబాద్‌ నగరంలో ఏఐ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్టు గూగుల్‌ ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది. టీహబ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో గూగుల్‌ ప్రతినిధులు ఎంఓయూ కుదుర్చుకున్నారు. కృత్రిమ మేధ అంకుర పరిశ్రమలకు గూగుల్‌ తోడ్పాటునందించనుంది. వ్యవసాయం, విద్య, రవాణారంగం, ప్రభుత్వ డిజిటల్‌ కార్యకలాపాలకు గూగుల్‌ ఏఐ కేంద్రం సహకరిస్తుందని ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)