రైలు సేవలను మరింత సులభతరం చేయడానికి, పారదర్శకతను పెంచడానికి భారతీయ రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్ నిబంధనల్లో 2025 సంవత్సరానికి మార్పులు తీసుకువచ్చినట్లు ఐఆర్సీటీసీ ప్రకటించింది. ఇప్పటివరకు ఉదయం 10:00 గంటలకు ప్రారంభమయ్యే తత్కాల్ టికెట్ బుకింగ్ ఇకపై ఉదయం 11:00 గంటలకు మొదలు కానుంది. తత్కాల్ టిక్కెట్ల కోసం ఏసీ, నాన్-ఏసీకోచ్‌లకు ప్రత్యేక కోటాలను నిర్ణయించారు. దీని ద్వారా ప్రయాణికులు తాము కోరుకున్న సీటును పొందే అవకాశాలు మెరుగుపడతాయి. టికెట్ డిమాండ్, లభ్యతను బట్టి ధరల్లో హెచ్చుతగ్గులు ఉండేలా చర్యలు చేపట్టనుంది. ఈ విధానం టిక్కెట్లలో పారదర్శకతను పెంచనుంది. తత్కాల్ టికెట్ బుక్ చేసుకునే వారికి ఆధార్ కార్డు తప్పనిసరి చేసింది. నకిలీ టిక్కెట్ల బుకింగ్‌ను నివారించేందుకు ఈ కొత్త నిబంధన అమలు చేయబడింది. ఇప్పటివరకు తత్కాల్ టిక్కెట్ రద్దుపై కఠిన నిబంధనలు ఉండేవి. అయితే, కొత్త మార్పుల ప్రకారం 24 గంటల ముందుగా టికెట్ రద్దు చేసిన ప్రయాణికులకు అధిక వాపసు లభించేలా ఐఆర్సీటీసీ మార్పులు చేసింది. ఈ కొత్త నిబంధనలతో తత్కాల్ టికెట్ బుకింగ్ మరింత సులభతరం అవుతుందని, ప్రయాణికులు ముందుగానే తెలుసుకుని తమ ప్రయాణ ప్రణాళికను సజావుగా చేసుకోవాలని ఐఆర్సీటీసీ సూచించింది.
తత్కాల్ టికెట్ బుకింగ్ లో కొత్త నిబంధనలు !
February 24, 2025
0
Tags