ఆల్‌టైమ్ గరిష్టానికి చేరుకున్న బంగారం ధరలు !

Telugu Lo Computer
0


దేశంలో బంగారం ధర పది గ్రాములు 87 వేలను దాటేసి రికార్డు సృష్టించింది. పది గ్రాముల బంగారం ధర 87 వేల రూపాయలను దాటడం ఇదే ప్రథమం. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.350 పెరిగి రూ.79, 800కు చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.390 పెరిగి 87, 060కు చేరింది. ఈ నెల ఒకటో తేదీ నుంచి బంగారం ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. పది గ్రాముల బంగారం ధర రూ.80 వేలు దాటిన తర్వాత చాలా తక్కువ కాలంలోనే రూ.87 వేలకు కూడా చేరుకుంది. భవిష్యత్తులో పది గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలకు కూడా చేరవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)