జగన్ కోసం పాటను పాడటం వల్ల చాలా అవకాశాలు కోల్పోయా : మంగ్లీ

Telugu Lo Computer
0


వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ వాళ్లను చులకనగా చూసిందని మంగ్లీని సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. టీడీపీ వారు ఒకసారి పాటను పాడాలని కోరితే పాడనంటూ తేగేసి చెప్పిందని టీడీపీ నేతలు ఆరోపణలు చేశారు. మరొవైపు ఇటీవల రథ సప్తమి వేళ అరసవెల్లికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మంగ్లీని ప్రొటోకాల్ లో స్పెషల్ గా దర్శనం కల్పించడం కూడా వివాదానికి దారితీసింది. దీనిపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. దీనిపై మంగ్లీ ఒక బహిరంగా లేఖను విడుదల చేశారు. గతంలో 2019 ఎన్నికల సమయంలో వైసీపీ పార్టీ వారు కోరితే పాటను పాడారన్నారు. టీడీపీ వారు కోరితే.. పాటను పాడనని చెప్పానని అనడంతో నిజంలేదన్నారు. ఒక వేళ నిరూపిస్తే దేనీకైన సిద్దమన్నారు. అంతేకాకుండా జగన్ కోసం పాటను పాడటం వల్ల చాలా అవకాశాలు కోల్పోయానన్నారు. అంతేకాకుండా.. వెంకటేశ్వర స్వామి తమ ఇంటి దైవమని.. జగన్ సర్కారు ఎస్వీబీసీ సలహాదారుగా ఉండమంటే తన ఇంటి దైవమని ఒప్పుకున్నట్లు చెప్పారు. తనకు మొదటి నుంచి చంద్రబాబు నాయుడు అంటే ప్రత్యేకంగా అభిమానమన్నారు. ఆయన ఒక విజన్ ఉన్న నేత అని చెప్పుకోవచ్చని, తనకు ఏ రాజకీయ పార్టీలతో సంబంధాలు లేవని, దయచేసి తనకు రాజకీయాలు ఆపాదించొద్దని కూడా మంగ్లీ కోరుతూ ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)