ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ కలిశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం మర్యాదపూర్వకంగా పవన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు పలు విషయాలు చర్చించుకొన్నారు. మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అనంతరం పవన్‌కల్యాణ్‌ను ఆయన సన్మానించారు. రాజేంద్ర ప్రసాద్‌ను పవన్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యాయి.
పవన్‌కల్యాణ్‌ను కలిసిన రాజేంద్రప్రసాద్
February 16, 2025
0
Tags