ఢిల్లీ పర్యటనలో రాహుల్ గాంధీతో భేటీ అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో తాము కోర్టు చెప్పినదాని ప్రకారమే ముందుకెళ్తామని అన్నారు. ప్రధాని మోడీని కులం విషయంలో తాను వ్యక్తిగతంగా దూషించలేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మోడీ పుట్టుకతోనే బీసీ కాదని మాత్రమే అన్నానని తెలిపారు. కానీ తన మాటలను కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ వక్రీకరించారని చెప్పారు. ఆయన పుట్టుకతోనే బీసీ కాదు కనుక వారి సమస్యలు కూడా పట్టవని రేవంత్ ఆరోపించారు. మోడీని కులం పేరుతో మాట్లాడుతున్నారని బీజేపి నేతలు చేస్తోన్న ఆరోపణలకు వివరణ ఇస్తూ రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో రాహుల్ గాంధీతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో తాము కోర్టు చెప్పినదాని ప్రకారమే ముందుకెళ్తామని అన్నారు.
మోడీని కులం విషయంలో తాను వ్యక్తిగతంగా దూషించలేదు : రేవంత్ రెడ్డి
February 15, 2025
0
Tags