జన సేన నేత కిరణ్ రాయల్ ఆరోపణలు చేసిన లక్ష్మీ రెడ్డి మీడియా సమావేశంలో అనేక విషయాలు వెల్లడించారు. దౌర్జన్యంగా జైపూర్ పోలీసులు వచ్చి నన్ను అరెస్ట్ చేశారని, లోకల్ పోలీసులు లేకుండా నన్ను అరెస్ట్ చేశారన్నారు. ఒక వెధవని వెధవా అంటూ నిరూపించడానికి ఒక మహిళకు చాలా కష్టం వచ్చిందని ఆవేదన చెందారు. 41 ఏ నోటీసులు ఇచ్చారా అని న్యాయమూర్తి ప్రశ్నిస్తే జైపూర్ పోలీసుల వద్ద సమాధానం లేదని తెలిపారు. ప్రైవేట్ వెహికల్ లో జైపూర్ పోలీసులు ఎలా వచ్చారని ప్రశ్నించారు. జైపూర్ పోలీసులు వచ్చిన వాహనంలో వైట్ కలర్ షర్ట్ లో ఉన్న ఆ వ్యక్తి ఎవరు అని అడిగారు. చెన్నై ఎయిర్ పోర్టులో నా బిడ్డను ఒంటరిగా వదిలి వచ్చానని బాధపడ్డారు. ఫ్లైట్ టికెట్ కు డబ్బులు లేకుండా మరుసటి రోజు మా అబ్బాయి జైపూర్ కు వచ్చాడని తెలిపారు. ఆ రోజే నాతోపాటు మా బాబు వచ్చి ఉంటే అదే రోజు రాత్రి తిరుపతికి వచ్చే వాళ్లమని పేర్కొన్నారు. జైపూర్ పోలీసుల ద్వారా నన్ను కిడ్నాప్ చేయాలని చూశారా అని ప్రశ్నించారు. వైసీపీ నాయకులు మా వెంట లేరని తెలిపారు. మాకు ఉన్న ఏకైక ప్రాపర్టీ అమ్ముకుని బెయిల్ పై బయటకు వచ్చానని తెలిపారు. పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ నా వెంట ఉన్నాడని నిత్యం కిరణ్ రాయల్ చెప్పే వాడని పేర్కొన్నారు. నా దగ్గర పవన్ రహస్య జీవితాన్ని సంబంధించిన పెన్ డ్రైవ్ ఉందని, నన్ను ఏమి చేయడని నన్ను ఏమీ అనడని కిరణ్ నాతో చాలా సార్లు చెప్పాడని ఆమె వివరించారు. నేను పవన్ కళ్యాణ్ నే చాలా సార్లు బ్లాక్ మెయిల్ చేశానని, ఇక నువ్వు ఎంత అని నాతో అన్నాడని ఆమె పేర్కొన్నారు. మాజీ మంత్రి రోజా బంధువును కూడా కిరణ్ రాయల్ ట్రాప్ చేశాడని సంచలన ఆరోపణలు చేశారు లక్ష్మి. ఆ కారణం వల్లే గతంలో కిరణ్ రాయల్ ను పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు.
మాజీ మంత్రి రోజా బంధువును ట్రాప్ చేసిన కిరణ్ రాయల్ : లక్ష్మీరెడ్డి
February 15, 2025
0
Tags