ఢిల్లీలో తెలుగు దేశం పార్టీ ఎంపీలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ బడ్జెట్‌లో లేనివాటికి సైతం కేంద్రం సాయం చేస్తోందని, విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారని, కేంద్రం నుంచి 8 నెలల్లోనే రూ.లక్షల కోట్ల నిధులు వచ్చాయని వెల్లడించారు. వికసిత్ భారత్‌లో ఏపీ ముఖ్య పాత్ర పోషిస్తోందన్నారు. ''ఏపీ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని నీతి ఆయోగ్ చెప్పింది. 2023 నాటికి రెవెన్యూ గ్రోత్ చాలా పడిపోయింది. 2014-19 మధ్య రూ. వందలో రూ.59 ఖర్చు పెట్టాం. అదే 2019-24 మధ్య రూ.వందలో రూ.22.54 మాత్రమే ఖర్చు పెట్టారని నీతిఆయోగ్ తెలిపింది. ఏపీ పరిస్థితి మెరుగుపర్చేందుకు కృషి చేయాలని, విద్యాప్రమాణాలు పెంచే స్టార్స్ కార్యక్రమంలో ఏపీని కూడా చేర్చాలని కేంద్రాన్ని కోరాం. నదుల అనుసంధానానికి నిధులు ఇవ్వాలని కోరాం'' అని వివరించారు.
కేంద్రం నుంచి 8 నెలల్లోనే రూ.లక్షల కోట్ల నిధులు వచ్చాయి : ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు
February 10, 2025
0
Tags