రూ. 88 వేల చేరువలో బంగారం ధర !

Telugu Lo Computer
0


బంగారం మార్కెట్లలో కళకళలు పెట్టుబడిదారులను సంతోష పెడుతున్నప్పటికీ రిటైల్ వ్యాపారులు, ఆభరణాలు కొనాలనుకుంటున్న భారతీయ కుటుంబాలకు మాత్రం పెద్ద షాక్ ఇస్తోంది. 22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.6,500 భారీ పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.8035, ముంబైలో రూ.8035, దిల్లీలో రూ.8045, కలకత్తాలో రూ.8035, బెంగళూరులో రూ.8035, కేరళలో రూ.8035, వడోదరలో రూ.8040, అహ్మదాబాదులో రూ.8040, జైపూరులో రూ.8045, లక్నోలో రూ.8045, కోయంబత్తూరులో రూ.8035, మంగళూరులో రూ.8035, నాశిక్ లో రూ.8038, మైసూరులో రూ.8035, అయోధ్యలో రూ.8045, బళ్లారిలో రూ.8035, గురుగ్రాములో రూ.8045, నోయిడాలో రూ.8045 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల గోల్డ్ ధర 100 గ్రాములకు నిన్నటితో పోల్చితే రూ.7,000 భారీ పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో పెరిగిన రిటైల్ గోల్డ్ రేట్లను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.8765, ముంబైలో రూ.8765, దిల్లీలో రూ.8780, కలకత్తాలో రూ.8765, బెంగళూరులో రూ.8765, కేరళలో రూ.8765, వడోదరలో రూ.8770, అహ్మదాబాదులో రూ.8770, జైపూరులో రూ.8780, లక్నోలో రూ.8780, కోయంబత్తూరులో రూ.8765, మంగళూరులో రూ.8765, నాశిక్ లో రూ.8768, మైసూరులో రూ.8765, అయోధ్యలో రూ.8780, బళ్లారిలో రూ.8765, గురుగ్రాములో రూ.8780, నోయిడాలో రూ.8780గా ఉన్నాయి. ఈవారంలో కూడా బంగారం ధరల అధిక ఒడిదొడుకులను చూస్తాయని భావిస్తున్నట్లు పృథ్వీఫిన్‌మార్ట్ కమోడిటీ రీసెర్చ్‌కు చెందిన మనోజ్ కుమార్ జైన్ పేర్కొన్నారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకునే నిర్ణయాల ప్రభావం ఎలా ఉండనుందనే ఆందోళనలు అస్థిరతకు కారణమని వెల్లడించారు. 


Post a Comment

0Comments

Post a Comment (0)