భారత్‌లో ఒరావెల్‌ స్టేస్‌ డాన్‌సెంటర్‌ !

Telugu Lo Computer
0


'ఓయో' మాతృ సంస్థ ఒరావెల్‌ స్టేస్‌, తన యూరోపియన్‌ హాలిడే హోం బ్రాండ్‌ డాన్‌సెంటర్‌ను భారత్‌లో ప్రారంభించినట్లు ప్రకటించింది. భారత్‌లో నార్త్‌ గోవాలోని సియోలిమ్‌లో విలాసవంతమైన విల్లాలతో డాన్‌సెంటర్‌ ప్రారంభం కానుంది. డాన్‌సెంటర్‌ను ఓయో వెకేషన్‌ హోమ్స్‌ 2019లో కొనుగోలు చేసింది. అప్పటి నుంచి కంపెనీ యూరప్‌లో తన ఉనికిని గణనీయంగా విస్తరించింది. దేశ అతిథులకు కొత్తగా నిర్మించిన ప్రాపర్టీల ద్వారా ప్రీమియం బ్రాండ్‌ అనుభవాన్ని అందించేందుకు కట్టుబడి ఉన్నామని ఓయో తెలిపింది. దీనికి గాను గోవాలో ప్రీమియం సర్వీస్డ్‌ అపార్ట్‌మెంట్లను ప్రారంభించేందుకు ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ప్రావిడెంట్ గ్రూప్‌తో ఓయో చర్చలు జరుపుతోంది. భారత్‌లో విలాసవంతమైన హాలిడే హోమ్‌ రెంటల్స్‌కు క్రమంగా డిమాండ్‌ పెరుగుతుందని ఒరావెల్‌ స్టేస్‌, లగ్జరీ బిజినెస్‌ హెడ్‌ ఆదిత్య శర్మ అన్నారు. డాన్‌సెంటర్‌, పూర్తి సర్వీస్‌ వెకేషన్‌ ఆధారిత హోం మేనేజ్‌మెంట్‌ కంపెనీ. ఇది బహుళ ఆన్‌లైన్‌ ట్రావెల్‌ ఏజెంట్లు, దాని వెబ్‌సైట్‌ ద్వారా డిమాండ్‌ను పెంచి ఇంటి యజమానులకు ఆదాయాన్ని పెంచుకోవడంలో సహాయపడుతుంది. 1957లో డెన్మార్క్‌లో స్థాపితం అయిన డాన్‌సెంటర్‌, ప్రస్తుతం డెన్మార్క్‌తో పాటు, స్వీడన్‌, నార్వే, జర్మనీ అంతటా 12 వేల ప్రాపర్జీలను నిర్వహిస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)