350 కి.మీ దూరం వరకు నిలిచిన వాహనాలు

Telugu Lo Computer
0


బల్‌పుర్‌-ప్రయాగ్‌రాజ్‌ మార్గంలోని జాతీయ రహదారిపై సుమారు 350 కి.మీ. పొడవున వాహనాలు నిలిచిపోయాయి. ఈ ఘటన ప్రపంచంలోనే అతి పొడవైన ట్రాఫిక్‌ జామ్‌గా చరిత్ర పుటలకు ఎక్కింది. మరో 48 గంటల పాటు ఎవరూ ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లొద్దని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి ప్రకటించారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిద్దామని మధ్యప్రదేశ్‌లోని ఛింద్వాడా నుంచి శనివారం ఉదయం బయలుదేరిన ఓ కుటుంబం మూడున్నర గంటల్లో జబల్‌పుర్‌ చేరుకుంది. అక్కడి నుంచి ప్రయాగ్‌రాజ్‌కు ఆదివారం ఉదయానికి గాని చేరుకోలేకపోయింది. ఆ తర్వాత ట్రాఫిక్‌ మరింత అస్తవ్యస్తం కావడంతో తిరుగు ప్రయాణం చేయలేక ఆదివారం రాత్రంతా అక్కడే ఉండిపోయింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి బయలుదేరిన భక్తులూ ఈ మార్గంలో వెళ్తూ తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మధ్యప్రదేశ్‌ నుంచి వెళ్లే మార్గాల్లో వాహనాల రద్దీ దృష్ట్యా రాబోయే రెండు రోజులపాటు ప్రయాగ్‌రాజ్‌ వైపు వెళ్లొద్దని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ యాత్రికులకు సూచించారు. ట్రాఫిక్‌ పరిస్థితులను గూగుల్‌లో చూసుకుంటూ ముందుకు సాగాలన్నారు. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్, సివనీ, కట్నీ, మైహర్, సాత్నా, రివా జిల్లాల్లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌లు అవుతున్నాయి. 50 కి.మీ మేర దూరానికే 10 నుంచి 12గంటల సమయం పడుతుందని ప్రయాణికులు వాపోతున్నారు. ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే మార్గాల్లో భారీ ట్రాఫిక్‌జామ్‌ చోటుచేసుకోవడంపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రహదారులపై చిక్కుకున్న లక్షల మంది భక్తులు ఆకలి, దాహంతో ఇబ్బంది పడుతున్నారంటూ ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వంపై విమర్శలు సంధించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)