ఉత్తరప్రదేశ్ లోని మిల్కిపుర్ అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ ఇప్పటివరకు మహాకుంభమేళాలో 34 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని తెలిపారు. భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని.. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా పటిష్ట భద్రత అందిస్తున్నట్లు పేర్కొన్నారు. "అయోధ్యలో రామ్ లల్లా దేవాలయం ఏర్పాటైనప్పుడు సమాజ్ వాదీ పార్టీ అడ్డుకుంది. అయోధ్య ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు మహార్షి వాల్మికీ పేరు పెట్టినప్పుడు అడ్డుకుంది. గత రెండునెలలుగా ఎస్పీ చీఫ్ ట్వీట్లు అన్నీ మహాకుంభమేళాకు వ్యతిరేకంగానే ఉన్నాయి.ఇప్పటివరకూ మహాకుంభమేళాలో 34కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఇది చారిత్రక ఘట్టం." అని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు.
కుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరించిన 34 కోట్ల మంది భక్తులు !
February 02, 2025
0
Tags