క్లాస్‌రూమ్ లో విద్యార్థిని పెళ్లి చేసుకున్న మహిళా ప్రొఫెసర్ ?

Telugu Lo Computer
0


శ్చిమ బెంగాల్ లోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీలో మొదటి సంవత్సరం విద్యార్థి, తన డిపార్ట్‌మెంట్ హెడ్‌కి నుదుటన సింధూరం దిద్దాడు. ఈ "క్లాస్‌రూమ్ వెడ్డింగ్" వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇది అకడమిక్ ప్రాజెక్ట్ అని ప్రొఫెసర్ పెళ్లి వార్తలను కొట్టి పారేసింది. దీనిపై విశ్వవిద్యాలయ అధికారులు విచారణ ప్రారంభించారు. విచారణ ముగిసే వరకు యూనివర్శిటీకి రావద్దంటూ ప్రొఫెసర్ ని సెలవుపై ఇంటికి పంపించింది. మహిళా ప్రొఫెసర్‌ అప్లైడ్ సైకాలజీ విభాగం అధిపతి, యూనివర్శిటీకి కొత్తగా వచ్చిన విద్యార్థి "క్లాస్‌రూమ్ వెడ్డింగ్"గా పిలవబడుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు తమ సహవిద్యార్థుల ముందు దండలు మార్చుకున్నారు. వేడుకలో ప్రొఫెసర్ మరియు విద్యార్థి తమను తాము భార్యాభర్తలుగా ప్రకటించుకున్నారని పేర్కొంటూ ముగ్గురు సాక్షులు సంతకం చేసిన పత్రం కూడా బయటకు వచ్చింది. దీనిపై ప్రొఫెసర్ స్పందిస్తూ, ఈ సంఘటన అకడమిక్ ప్రాజెక్ట్‌లో భాగమని, అసలు ఇది పెళ్లి కాదని చెప్పారు. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడుతుందని యూనివర్శిటీ యాజమాన్యం చెబుతోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)