పోస్ట్ ఆఫీస్ గ్రామ సురక్ష యోజన స్కీంలో రోజుకు 50 రూపాయలు పెట్టుబడి పెట్టడం ద్వారా మెచ్యూరిటీ నాటికి ఏకంగా 35 లక్షల రూపాయలు అందుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్ గ్రామ సురక్ష యోజన గ్రామీణ పౌరులకు ఆర్థిక భద్రత మంచి రాబడిని అందిస్తుంది. పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ కు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉంటుంది. కాబట్టి ఎలాంటి రిస్క్ ఉండదు. గ్యారెంటీ రిటర్న్స్ అందుకోవచ్చు. గ్రామ సురక్ష యోజన గ్రామ పోస్టర్ లైఫ్ ఇన్సూరెన్స్ లో ఒక భాగం. ఈ గ్రామ సురక్ష యోజనలో 19 నుంచి 55 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ స్కీం లో రూ.10 నుంచి రూ.10 లక్షల వరకు పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఇందులో ప్రీమియంను నెల వారి, త్రైమాసికం, అర్ధ సంవత్సరం, వార్షికంగా కూడా చెల్లించుకోవచ్చు. లోన్స్ సౌకర్యాన్ని కూడా అందిస్తుంది. 19ఏళ్ల వయసులో రూ. 10 లక్షల ప్రీమియం తీసుకున్నట్లయితే 55 సంవత్సరాలు వచ్చే వరకు 1515 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. 58 ఏళ్ల వరకు ఈ స్కీములో నమోదు చేసుకుంటే అప్పుడు 1463, 60 ఏళ్లకు అయితే 1411 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ పథకంలో 50 ఏళ్ల ప్రీమియం ఎంచుకుంటే మెచ్యూరిటీ నాటికి 31.60 లక్షల కార్పస్ పొందుతారు. 58 ఏళ్ల ప్రీమియం ఎంచుకుంటే మెచ్యూరిటీ నాటికి 33.40 కార్పస్ పొందుతారు. 60 ఏళ్ల ప్రీమియం ద్వారా 34.4 లక్షల అందుకుంటారు. పోస్ట్ ఆఫీస్ గ్రామ సురక్ష యోజనలో పెట్టుబడిదారుడు మరణిస్తే ఆ కుటుంబానికి మొత్తం ఫండ్ అందుతుంది. తద్వారా పెట్టుబడిదారు కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది.
పోస్ట్ ఆఫీస్ గ్రామ సురక్ష యోజన స్కీం !
January 23, 2025
0
Tags