దావోస్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన చంద్రబాబు నాయుడు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన ముగించుకుని  ఢిల్లీకి చేరుకోనున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి చంద్రబాబు నేరుగా 1 జన్ పథ్ లోని తన అధికారిక నివాసానికి వెళ్లనున్నారు. జనవరి 24న చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పలువురు కేంద్రమంత్రులు, ప్రముఖులను కలవనున్నారు. ఉదయం 11 గంటలకు చంద్రబాబు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ను కలవనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో భేటీ కానున్నారు. కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్, ప్రహ్లాద్ జోషితో సమావేశం కానున్నారు. జనవరి 24 సాయంత్రం చంద్రబాబు విజయవాడకు చేరుకోనున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)