ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్టీసీ ) 'ఇప్పుడే బుక్ చేయండి-తర్వాత చెల్లించండి' కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనికింద ప్రయాణికులు టిక్కెట్లను వెంటనే బుక్ చేసుకుని తర్వాత డబ్బులు పే చేసేందుకు వెసులుబాటును అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా ఇకపై ముందస్తుగా టిక్కెట్ కొనుగోలుకు డబ్బు చెల్లించకుండానే కన్ఫర్మ్ టిక్కెట్ ను పొందవచ్చని తెలుస్తోంది. దీనికోసం మొత్తం బుకింగ్ ప్రక్రియను ఆన్‌లైన్‌లోనే పూర్తి చేయాల్సి ఉంటుంది. ముందుగా ప్రయాణికులు తమ IRCTC ఖాతాలోకి లాగిన్ చేసి, ఆపై 'బుక్ నౌ' ఎంపికను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో క్యాప్చా కోడ్‌తో పాటు ప్రయాణీకుల వివరాలను అందించాల్సిన కొత్త పేజీ తెరవబడుతుంది. ఇక్కడ ప్రయాణం చేస్తున్న వ్యక్తులకు సంబంధించిన వయస్సుతో పాటు ఇతర వివరాలను నమోదు చేసిన తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. వివరాలను అందించిన తర్వాత చెల్లింపు పేజీకి వెళ్లినప్పుడు పేమెంట్ పేజ్ తెరవబడుతుంది. ఇక్కడ BHIM UPI యాప్ లేదా నెట్ బ్యాంకింగ్‌ని ఉపయోగిస్తున్నప్పుడు క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌ల ద్వారా చెల్లించటానికి వెసులుబాటు ఉంటుంది. ప్రయాణికులు పే లేటర్ ఫీచర్‌ని ఉపయోగించాలనుకునే కస్టమర్‌లు ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. ఇందుకోసం www.epaylater.inకి వెళ్లాల్సి ఉంటుంది. కస్టమర్ ఈ నమోదు ప్రక్రియను పూర్తి చేసుకున్న తర్వాత ఎలాంటి ముందస్తు చెల్లింపులు లేకుండానే రైలు టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు. పే లేటర్ సౌకర్యాన్ని రైల్వే సంస్థ ఇంటిగ్రేట్ చేయటం వరకు బాగానే ఉన్నప్పటికీ చాలా మందికి తెలియని విషయం ఆ సొమ్మును తిరిగి ఎప్పుడు చెల్లించాలన్నదే. టిక్కెట్లను పే లేటర్ కింద బుక్ చేసుకున్న వ్యక్తులు టిక్కెట్ రిజర్వేషన్ తర్వాత 14 రోజుల్లోపు చెల్లింపును పూర్తి చేయాల్సి ఉంటుంది. సకాలంలో పేమెంట్ చెల్లించటంలో విఫలమైతే 3.5 శాతం సర్వీస్ ఛార్జీ పెనాల్టీగా విధించబడుతుంది. అదే సకాలంలో పేమెంట్ చేసేవారికి మాత్రం ఎలాంటి అదనపు ఖర్చులు ఉండబోవు. ఐఆర్టీసీ థర్డ్-పార్టీ పేమెంట్ ప్లాట్‌ఫారమ్‌లతో భాగస్వామ్యాల ద్వారా టిక్కెట్లను కొనుగోలు చేసిన తర్వాత చెల్లించే ఆప్షన్ అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇప్పుడే బుక్ చేయండి-తర్వాత చెల్లించండి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఐఆర్టీసీ
January 24, 2025
0
Tags