విశాఖపట్నంలో కేంద్ర మంత్రుల కాన్వాయ్ లకు ప్రమాదం

Telugu Lo Computer
0


కేంద్ర మంత్రులు కుమార్ స్వామి, శ్రీనివాస వర్మ కాన్వాయ్ లో తృటిలో పెను ప్రమాదం తప్పింది. విశాఖపట్నంలోని షీలా నగర్ వద్ద కేంద్ర మంత్రులు కుమార్ స్వామి, శ్రీనివాస వర్మలకు సంబంధించిన కాన్వాయ్ లో మూడు వాహనాలు ఒకదానితో మరోటి ఢీ కొట్టుకున్నాయి. ఈ తరుణంలోనే ఎనిమిది వాహనాల కాన్వాయ్ లో మూడు కార్లు ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. ఇందులో కేంద్ర మంత్రులు కుమార్ స్వామి, శ్రీనివాస వర్మలకు చెందిన మూడు కార్లు దెబ్బతిన్నాయి. ధ్వంసమైన కార్లలలో మాజీ ఎంపీ జివీఏల్ కారు కూడా ఉందని సమాచారం. ఇక ఈ ప్రమాదంలో కేంద్ర మంత్రులు కుమార్ స్వామి, శ్రీనివాస వర్మలకు ఎలాంటి ప్రమాదం జరుగలేదు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ ప్రమాదం అనంతరం కేంద్ర మంత్రులు కుమార్ స్వామి, శ్రీనివాస వర్మ స్టీల్‌ప్లాంట్‌ వద్దకు చేరుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)