శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. సైబరాబాద్ కంట్రోల్‌రూమ్‌కు ఆగంతకుడు ఫోన్‌ చేశాడు. ఎయిర్ పోర్ట్ భద్రతా సిబ్బంది అప్రమత్తమై ముమ్మర తనిఖీలు చేపట్టారు. దీన్ని ఫేక్‌ కాల్‌గా భద్రతా సిబ్బంది తేల్చారు. బెదిరింపు కాల్‌ చేసిన వ్యక్తి తెలంగాణలోని కామారెడ్డి వాసిగా అధికారులు గుర్తించారు. నిందితుడికి మతిస్థిమితం లేదని తేల్చారు. బాంబు బెదిరింపు కాల్‌ ఫేక్‌ అని తేలడంతో ఎయిర్‌పోర్టు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)