ఉత్తర ప్రదేశ్‌లోని హర్దోయి జిల్లాలో రాజేశ్వరి అనే ఓ మహిళ తన భర్త, ఆరుగురు పిల్లలను వదిలేసి నన్హే పండిట్ అనే బిచ్చగాడితో లేచిపోయింది. ఈ మేరకు రాజేశ్వరి భర్త రాజ్ కుమార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. నన్హే పండిట్ తమ విధితో పాటు చుట్టూ పక్కల ప్రతిరోజూ భిక్షం అడుక్కుంటూ ఉండేవాడని, పెట్టింది తిని వెళ్లిపోయేవాడని రాజ్ కుమార్ తెలిపారు. కానీ కొన్ని రోజులుగా అతను తన భార్యతో అనువుగా మాట్లాడడం, తనకు అనుమానం వస్తుందని వారు ఫోన్‌లో కూడా మాట్లాడుకునేవారని తెలిపారు. జనవరి 3వ తేదీన కూరగాయలు, బట్టలు తీసుకొస్తానని చెప్పి తన భార్య ఇంట్లో నుంచి వెళ్లిందని, అప్పటి నుంచి ఇంటికి రాలేదని పోలీసులకు తెలిపాడు. నన్హే పండిట్‌తోనే వెళ్ళిపోయి ఉండొచ్చని, తన భార్య పోయినప్పటి నుంచి ఆ బిచ్చగాడు కూడా కనిపించడం లేదని తెలిపాడు. గేదె అమ్మడంతో పాటు, నగలు అమ్మి వచ్చిన డబ్బులు తీసుకొని ఇద్దరూ పారిపోయారని అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో ఈ ఘటన స్థానికంగానే కాదు, దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రత్యేకంగా ఈ ఘటన అని మాత్రమే కాదు. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు చాలానే జరుగుతున్నాయి.
భర్తను వదిలేసి బిచ్చగాడితో లేచిపోయిన భార్య ?
January 09, 2025
0
Tags