తెలంగాణకు ఏడు రకాల బీర్ల సరఫరా నిలిచిపోనుంది. ఐదేళ్లుగా ధరలు పెంచకపోవడంతో భారీగా నష్టాలు వస్తున్నాయని పేర్కొంటూ యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ (యూబీఎల్) ఈమేరకు నిర్ణయం తీసుకుంది. యూబీఎల్ ప్రతినిధులు బుధవారం ఎక్సైజ్‌శాఖ కమిషనర్‌ను కలిసి తెలంగాణకు పూర్తిగా బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్టు లేఖ అందజేశారు. ధరలు పెంచాలని పలు మార్లు కోరినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని, దీంతో తమకు భారీగా నష్టాలు వస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు.
తెలంగాణకు యూబీఎల్ బీర్ల సరఫరా నిలిపివేత !
January 08, 2025
0
Tags