రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కి వచ్చిన ప్రధాని మోడీకి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలికారు. సిరిపురం జంక్షన్ నుండి ఆంధ్రా యూనివర్సిటీ వరకు రోడ్ షో నిర్వహించారు. దీనికి ప్రజల నుండి భారీ స్పందన వచ్చింది. అనంతరం ఆంధ్ర యూనివర్సిటీ కాలేజీ గ్రౌండ్స్ లో బహిరంగ సభలో మోడీ పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ప్రశంసలు జల్లు కురిపించారు. అంధకారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలుగులు నింపారని ఆయన పేర్కొన్నారు. వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ అందించారని కితాబిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలుగులు నింపిన ప్రధాని మోడీకి అండగా ఉంటామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ధైర్య సాహసాలతో నింపితే అది పటిష్ట భారత్ గా మారుతుందని, సదాశయంతో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడిస్తే అది స్వచ్చ భారత్ అవుతుందని, సదుద్దేశం ఉంటే ఏదైనా సాధ్యమేనన్నారు. ఆ సదాశయమే బలమైన భారత్ కోసం ప్రధాని మోడీకృషి చేసేలా చేస్తుందన్నారు. ఆత్మ నిర్భర్ భారత్, స్వచ్చ భారత్ నినాదాలతో మోడీ ప్రజల మనసు గెలుచుకున్నారన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ స్ఫూర్తితో ఏపీ లో ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. ప్రజలందరినీ ఏకతాటిపై నడిపించడంలో మోడీ విజయాన్ని సాధించారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఐదేళ్ల అరాచక పాలనలో ఏపీ అంధకారంలో కూరుకుపోయిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రస్తుతం అభివృద్ధి అంటే ఆంధ్ర అనే లాగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ఆయన పేర్కొన్నారు. మోడీ సర్కార్ నిధులు ఇవ్వడంతోనే మారుమూల గిరిజన గ్రామాలకు కూడా రోడ్లు వేయగలుగుతున్నామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. అభివృద్ధిలో ఏ ప్రాంతం వెనుక పడకూడదని ఆయన అన్నారు. 2 లక్షల కోట్ల ప్రాజెక్టులతో ఏడు లక్షల మందికి ఉపాధి కలుగుతుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మోడీ సంకల్పానికి ఆయన అందిస్తున్న సహకారానికి తన వంతుగా పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.
నరేంద్ర మోడీపై ప్రశంసల జల్లులు కురిపించిన పవన్ కళ్యాణ్ !
January 08, 2025
0
Tags