సన్యాసం తీసుకున్న సినీ నటి మమతా కులకర్ణి !

Telugu Lo Computer
0


సినీ నటి మమతా కులకర్ణి సన్యాసం తీసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు వెళ్లిన ఆమె మహామండలేశ్వర్‌గా మారుతున్నట్లు ప్రకటించింది. ఆధ్యాత్మిక బాటలో ప్రయాణించానలుకున్న ఆమె ఫిబ్రవరి వరకు కుంభమేళాలో ఉంటానని పేర్కొంది. జనవరి 24న కిన్నార్‌ అఖారాలో ఆచార్య మహామండలేశ్వర్‌ డాక్టర్‌ లక్ష్మీ నారాయణ త్రిపాఠి సమక్షంలో ఆమె సన్యాస దీక్ష తీసుకుంది. తన పేరును శ్రీ యామై మమతా నందగిరిగా మార్చుకుంది. కాషాయ దుస్తులు ధరించి, మెడలో రుద్రాక్షతో, భుజానికి వేలాడుతున్న కుంకుమ పువ్వుతో ఆమె దర్శనమిచ్చింది. 25 ఏళ్ల తర్వాత ఇండియాకు వచ్చిన ఆమె ఇలా సాధ్విగా మారిపోవడం చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఒకప్పుడు మమతా కులకర్ణి సినిమా ఇండస్ట్రీలో అగ్రతారగా వెలుగొందింది. కరణ్‌ అర్జున్‌, దిల్‌బర్‌, క్రాంతివీర్‌, సబ్‌సే బడా ఖిలాడి, కిస్మత్‌, నజీబ్‌ వంటి చిత్రాలతో బాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ప్రేమ శిఖరం, దొంగ పోలీస్‌ చిత్రాల్లో కథానాయికగా నటించింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)