దేవుడు మనల్ని ఒక కంట కనిపెడుతూనే ఉంటారు - అయినప్పటికీ, హెల్మెట్ ధరించడం మంచిది !

Telugu Lo Computer
0

హదారిపై ట్రాఫిక్ లైట్ వద్ద తన కారు ఉన్న సమయంలో అందులో నుంచి ఆనంద్ మహీంద్రా ఈ ఫొటో తీశారు. రోడ్డుపై ఓ వ్యక్తి బైకుపై వెళ్తున్నాడు. ఆ బైకు వెనకాల కూర్చున్న వ్యక్తి శ్రీకృష్ణుడి చిత్రపటాన్ని పట్టుకున్నాడు. ఆ బైక్‌ నడుపుతున్న వ్యక్తికి ఓ పక్క భక్తి భావం ఉంది కానీ, ట్రాఫిక్ రూల్స్‌ మాత్రం పాటించడంలేదు. ఆ బైకుపై ఉన్న వ్యక్తి హెల్మెట్‌ పెట్టుకోలేదు. ఈ విషయాలన్నింటినీ గుర్తించిన ఆనంద్ మహీంద్ర దీనిపై స్పందిస్తూ.. 'ట్రాఫిక్ లైట్‌ పడిన సమయంలో ఈ ఫొటోని చివరి క్షణంలో తీయగలిగాను. దేవుళ్లు మనల్ని ఎప్పుడూ ఓ కంట కనిపెడుతూనే ఉంటారు. అయినప్పటికీ, హెల్మెట్ ధరించడం మంచిది' అని పేర్కొన్నారు. ఆనంద్ మహీంద్ర చేసిన ఈ ట్వీట్‌ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. 'హెల్మెట్లు పెట్టుకోరు, తోటివారికి ఇబ్బందులు కలిగిస్తారు. కానీ, దేవుడికి మాత్రం మొక్కుతుంటారు' అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మనం ప్రమాదాలు కోరి తెచ్చుకుంటే మనల్ని దేవుడు కూడా కాపాడలేడని కొందరు కామెంట్లు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)