ఆంధ్రప్రదేశ్ లో వైకాపా సామాజిక మాధ్యమ కార్యకర్త వర్రా రవీందర్‌రెడ్డిని పులివెందుల పోలీసులు రెండు రోజుల కస్టడీకి తీసుకున్నారు. కడప జైలు నుంచి ఆయన్ను రిమ్స్‌కు తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం కడప సైబర్ క్రైమ్ పీఎస్‌లో వర్రా రవీందర్‌రెడ్డిని విచారించనున్నారు. సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, మంత్రులు లోకేశ్, అనితలపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వర్రా వెనకున్న కుట్రదారులను గుర్తించేందుకు పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఈ నెల 8, 9 తేదీల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు న్యాయవాది సమక్షంలో వర్రాను విచారించవచ్చునని కడప 4వ అదనపు జిల్లా కోర్టు మంగళవారం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు బుధవారం వర్రాను కడప కేంద్ర కారాగారం నుంచి అదుపులోకి తీసుకున్నారు. ఐటీ, అట్రాసిటీ చట్టాల కింద నవంబరు 8న వర్రాతోపాటు సజ్జల భార్గవ్‌రెడ్డి, అర్జున్‌రెడ్డిలపై కేసు నమోదు కాగా, ఏ-1గా ఉన్న వర్రాను నవంబరు 11న అరెస్టు చేశారు. భార్గవరెడ్డి సూచనల మేరకే తెదేపా, జనసేన, కాంగ్రెస్ పార్టీల నాయకులపై అసభ్యకర పోస్టులు పెట్టినట్లు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో వర్రా పేర్కొన్నారు.
పోలీసు కస్టడీలో వర్రా రవీందర్‌రెడ్డి !
January 08, 2025
0
Tags