జగన్‌ మోహన్ రెడ్డికి ఐదేళ్ల వ్యవధికి పాస్‌పోర్ట్ మంజూరు చేయాలని హైకోర్టు ఆదేశం!

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డికి  ఐదేళ్ల వ్యవధికి పాస్‌పోర్ట్ మంజూరు చేయాలని అధికారులను ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా గతంలో ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశాలను హైకోర్టు కొట్టివేసింది. 2024 ఆగస్టులో వైఎస్ జగన్ తన కుమార్తె పుట్టినరోజు కోసం విదేశాలకు వెళ్లేందుకు రెగ్యులర్ పాస్‌పోర్టు జారీ చేయాల్సిందిగా కోర్టును ఆశ్రయించారు. అయితే, దీనిపై విచారించిన ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు తోసిపుచ్చింది. ఐదేళ్లకి పాస్‌పోర్టు మంజూరు చేయాలని అందుకు ఎన్వొసీని ఇవ్వాలని ప్రజా ప్రతినిధుల కోర్టును జగన్ మోహన్ రెడ్డి ఆశ్రయించారు. పాస్ పోర్ట్ మంజూరు కోసం 20వేల పూచీకత్తుతో పాటు ప్రత్యక్షం హాజరుకావాలని వైఎస్ జగన్‌కి గతంలోనే ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే ప్రజా ప్రతినిధుల కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆయన సోమవారం వైఎస్ జగన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ప్రత్యక్షంగా హాజరు కావాలని 20వేల పూచీకత్తు సమర్పించాలని విజయవాడ ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. దాంతో వైఎస్ జగన్‌కు ఊరట దక్కింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)