దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల నడుమ ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు ఆటో, ఐటీ కంపెనీల షేర్ల మద్దతుతో రాణించాయి. అల్ట్రాటెక్ సిమెంట్, ఎంఅండ్‌ఎం, సన్‌ఫార్మా షేర్లు సూచీలకు దన్నుగా నిలిచాయి. దీంతో సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 115 పాయింట్లు, నిఫ్టీ 50 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి. సెన్సెక్స్ ఉదయం 76,414.52 (క్రితం ముగింపు 76,404.99) వద్ద ఫ్లాట్‌గా ప్రారంభమైంది. ప్రారంభంలోనే కాస్త ఒత్తిడికి లోనైన సూచీ ఇంట్రాడేలో 76,202.12 వద్ద కనిష్ఠాన్ని తాకింది. ఐటీ, ఆటో రంగ షేర్లలో మదుపర్లు కొనుగోళ్లకు దిగగా ఇంట్రాడేలో 76,743.54 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 115 పాయింట్లు లాభంతో 76,520.38 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 పాయింట్ల లాభంతో 23,205.35 వద్ద స్థిరపడింది.అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 78.97డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. బంగారం ఔన్సు 2,755 డాలర్ల వద్ద కొనసాగుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.86.47 వద్ద ముగిసింది.
స్వల్ప లాభాల్లో ముగిసిన సూచీలు
January 23, 2025
0
Tags