అన్షు, నా మాటల వల్ల బాధపడ్డ మహిళలందరూ నన్ను క్షమించండి !

Telugu Lo Computer
0


ర్శకుడు త్రినాథరావు నక్కిన మన్మథుడు ఫేమ్ నటి అన్షుపైచేసిన అనుచిత వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. మజాకా సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌లో అన్షును ఉద్దేశించి సైజులు పెంచాలి అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. త్రినాథరావుపై నెటిజన్లు ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో ఆయన ఓ వీడియో రిలీజ్ చేశారు. ''అన్షు, నా మాటల వల్ల బాధపడ్డ మహిళలందరికీ నా క్షమాపణలు తెలియజేస్తున్నా. నా ఉద్దేశం ఎవరిని బాధ కలిగించడం కాదు. తెలిసి చేసినా తెలియకుండా చేసినా తప్పు తప్పే. మీరంతా పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమిస్తారని కోరుకుంటున్నా'' అని అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)