ఆంధ్రప్రదేశ్ లో అందుబాటులోకి వచ్చిన రూ 99 క్వార్టర్ మద్యం !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో కొత్త మద్యం పాలసీ అమలులో భాగంగా రూ 99కే క్వార్టర్ మద్యం అందుబాటులోకి తీసుకొచ్చారు. మొత్తం 16 కంపెనీలతో మద్యం ధరల తగ్గింపు పైన ప్రభుత్వం చర్చలు జరిపింది. ఇప్పటికే పది కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలు తగ్గించగా, తాజాగా మరో ఆరు కంపెనీలు ముందుకు రావటం తో వీటి ధరలు తగ్గాయి.  కొన్ని ప్రముఖ బీర్ల ధరలను కూడా తగ్గించారు. లిక్కర్‌ బ్రాండ్లలో క్వార్టర్‌పైనే రూ.20 నుంచి రూ.80 వరకు ధరలు తగ్గుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. మాన్సన్‌ హౌస్‌ కంపెనీ క్వార్టర్‌ సీసాపై రూ.30 తగ్గించింది. అదే విధంగా అరిస్ర్టోకాట్‌ ప్రీమియం సుపీరియర్‌ విస్కీ ధర ఏకంగా రూ.50 తగ్గింది. కింగ్‌ఫిషర్‌ బీరు రూ.10 తగ్గింది. బ్యాగ్‌పైపర్‌ గోల్డ్‌ రిజర్వ్‌ విస్కీ ఒకేసారి రూ.80 తగ్గించుకునేందుకు దరఖాస్తు చేసింది. కంపెనీలు ధరలు తగ్గించుకోవడం వల్ల ప్రభుత్వానికి వచ్చే పన్నులు తగ్గతాయనే వాదన ఉంది. కంపెనీల కంటే ప్రభుత్వ ఖజానాకు వచ్చే ఆదాయం తగ్గుతుందని చెబుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)