హర్యానాకు చెందిన అభయ సింగ్ ఉన్నత చదువులు చదివాడు. ఐఐటీ - బాంబేలో ఏరో స్పేస్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. క్యాంపస్ ప్లేస్ మెంట్ లోనే మంచి ఉద్యోగం కైవసం చేసుకుని ఓ కార్పొరేట్ సంస్థలో పని చేశాడు. ఫొటోగ్రఫీపై మక్కువతో తొలుత కార్పొరేట్ ఉద్యోగాన్ని వదులుకున్నారు. ఆ తర్వాత చిన్నగా ఆధ్యాత్మికం వైపు అడుగులు వేశారు. ప్రస్తుతం ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు హాజరయ్యారు. ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వూతో ఆయన ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. నెటిజన్లు ఆయన్ను ఐఐటీ బాబా, ఇంజినీర్ బాబాగా పిలుస్తున్నారు. నిజానికి అభేయ్ సింగ్ ఐఐటీలో చదువుకునే రోజుల్లోనే ఫిలాసఫీ వైపు ఆకర్షితుడయ్యాడు. చాలా ఫిలాసఫీ కోర్సులు చదవడంతో పాటు సోక్రటీస్, ప్లేటోలనూ పూర్తిగా చదివాడు. శివుడిని అమితంగా ఆరాధించే ఈ ఐఐటీ బాబా తన జీవితంలో ఇదే అత్యుత్తమ దశగా అభివర్ణించారు. సైన్స్ ద్వారా ఆధ్యాత్మికతను అర్థం చేసుకుంటున్నట్లు తెలిపారు. మహా కుంభమేళాలో ఎంతోమంది సాధువులు ఉన్నా ఓ మహిళ మాత్రం ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నారు. ఉత్తరాఖండ్ కు చెందిన హర్ష్ రిచారియా తన సంప్రదాయ వస్త్రధారణ, తిలకం, రుద్రాక్ష మాలతో ప్రత్యేకంగా కనిపిస్తున్నారు. వీడియోలు, ఇంటర్వూలతో ఆమె వైరల్గా మారారు. కుంభమేళాకు వచ్చిన వారంతా ఆమెను మహా సాధ్వీగా పిలుస్తుండగా.. ఆమె మాత్రం సున్నితంగా వారిస్తున్నారు. తాను సాధ్వీని కాదని, కేవలం మంత్రాలు మాత్రమే జపిస్తుంటాని తెలిపారు.
మహా కుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఐఐటీ బాబా అభయ సింగ్, హర్ష్ రిచారియా !
January 16, 2025
0
Tags