దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల సంకేతాలు సూచీలకు దన్నుగా నిలిచాయి.ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐటీసీ షేర్లు కొనుగోళ్ల మద్దతుతో మార్కెట్ సూచీలు రాణిస్తున్నాయి. మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా లాభంతో నిఫ్టీ 23,400 మార్క్ పైన ప్రారంభమైంది. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 103 పాయింట్లు లాభంతో 77,177 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 68 పాయింట్లు పెరిగి 23,412 వద్ద కదలాడుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో అల్ట్రాటెక్ సిమెంట్, టెక్‌మహీంద్రా, ఐటీసీ, నెస్లే ఇండియా, హెచ్‌యూఎల్, టీసీఎస్, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. జొమాటో, ఎన్టీపీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, ఎస్‌బీఐ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 80.22 డాలర్ల వద్ద, బంగారం ఔన్సు 2,743.90 వద్ద ట్రేడవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 86.28 వద్ద కొనసాగుతోంది. అమెరికా మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. ఆసియా-పసిఫిక్ మార్కెట్లు నేడు లాభాల్లో కొనసాగుతున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు సోమవారం నికరంగా రూ.4,337 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించగా.. దేశీయ సంస్థాగత మదుపర్లు నికరంగా రూ.4,322 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు.
లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు !
January 21, 2025
0
Tags