ఛత్తీస్‌గఢ్‌ భారీ ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోయిస్టులు మృతి !

Telugu Lo Computer
0


త్తీస్‌గఢ్‌లోని గరియాబంద్‌ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. దీంతో నిన్నటి నుంచి జరుగుతోన్న ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టుల సంఖ్య 12కి చేరిందని పోలీసులు వెల్లడించారు. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా గరియాబంద్‌ జిల్లాలో ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా పోలీసులు, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది కలిసి ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నిన్న ఇద్దరు మావోయిస్టులు మృతి చెందగా, తెల్లవారుజామున జరిపిన గాలింపులో మరో 10 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇంకా ఈ ప్రాంతంలో సెర్చ్‌ ఆపరేషన్ జరుగుతోంది. ఇందులో వెయ్యిమంది వరకు భద్రతా సిబ్బంది పాల్గొన్నట్లు తెలుస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)