ఆటోలపైకి దూసుకెళ్లి బోల్తాపడిన ఇనుప స్తంభాల ట్రక్కు : ఐదుగురు మృతి

Telugu Lo Computer
0


తెలంగాణలోని వరంగల్ జిల్లా మామూనూరులో భారీ ఇనుము లోడుతో వెళ్తున్న ఒక ట్రక్కు అదుపుతప్పి రెండు ఆటోలపైకి దూసుకెళ్లి బోల్తాపడింది. దాంతో ట్రక్కుకి బిగించి కట్టిన తాళ్లు తెగిపోయాయి. ఆ ఇనుము లోడ్ అంతా పక్కనుండే వెళ్తున్న రెండు ఆటోలపై పడిపోయింది. ఆ ఇనుము లోడ్ మీదపడటంతో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ట్రక్కు డ్రైవర్ మద్యం తాగి రాంగ్ రూట్‌లో వేగంగా వెళ్లడమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో చనిపోయిన వారంతా మధ్యప్రదేశ్ భోపాల్ జిల్లాలోని లలిత్ నగర్ ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. బతుకుదెరువు కోసం వారు ఇక్కడికి వలస వచ్చినట్లు తెలుస్తోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)