గణతంత్ర వేడుకలో స్వయంగా చెత్త ఏరిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ !

Telugu Lo Computer
0


భారత 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  ఆదివారం కర్తవ్య పథ్ వద్ద చెత్తను స్వయంగా తీసి స్వచ్ఛభారత్ లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారు. కర్తవ్య పథ్ వద్ద చెత్త కనిపించగానే ప్రధానమంత్రి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ ను స్వాగతించే సమయంలో, తానే స్వయంగా చెత్తను తీసేశారు. ప్రధానమంత్రి గతంలో ఎన్నో సార్లు ప్రజలందరూ స్వచ్ఛత పనుల్లో పాల్గొనాలని, స్వచ్ఛ భారత్ సాధన కోసం కృషి చేయాలని సూచించారు. ప్రధానమంత్రి చేసిన ఈ చర్య, ప్లాగింగ్ పట్ల ఆయన చూపిస్తున్న ప్రాధాన్యతను తెలియజేస్తుంది. గత సంవత్సరం నవంబరులో 'మన్ కి బాత్' కార్యక్రమంలో ఆయన కాన్పూర్ గంగాఘాట్లను శుభ్రం చేస్తున్న ప్లాగింగ్ గ్రూప్‌ను ప్రశంసించారు. అలాగే డిసెంబర్‌లో రక్షణ శాఖ దేశవ్యాప్తంగా 400కు పైగా ప్రదేశాల్లో భారీ ప్లాగింగ్ కార్యక్రమాలను నిర్వహించింది. ఇది స్వచ్ఛత పఖ్వాడా చర్యల్లో భాగం. ఆదివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కర్తవ్య పథ్ వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి.. జాతీయ గీతం ఆలపించగా, 21 తుపాకీ గుండ్ల మోత వినిపించింది. ఇది పూర్తి స్వదేశీ తుపాకీ వ్యవస్థ అయిన 105-mm లైట్ ఫీల్డ్ గన్స్ ద్వారా నిర్వహించబడింది.గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుక 75 సంవత్సరాలుగా భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన సందర్భాన్ని గుర్తుచేస్తూ ప్రజల భాగస్వామ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టింది.కర్తవ్య పథ్ వద్ద వేడుకలకు ముందు ప్రధానమంత్రి నేషనల్ వార్ మెమోరియల్ వద్ద పూలమాల వేసి, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరులకు నివాళులర్పించారు. అనంతరం, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇండియన్ నేవీ అధికారుల సహకారంతో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సంవత్సరం దాదాపు 10,000 ప్రత్యేక ఆహ్వానితులు గణతంత్ర దినోత్సవ పరేడ్‌ను వీక్షించేందుకు పిలవబడ్డారు. వీరిలో ప్రభుత్వ పథకాలను మెరుగైన రీతిలో ఉపయోగించిన వారు, వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారు ఉన్నారు. వీరు స్వర్ణిమ భారత్ రౌండ్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ అని గుర్తింపు పొందారు. ఈ సంవత్సరం పరేడ్‌లో 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, 10 కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు పాల్గొన్నాయి. వీటిలో స్వర్ణిమ భారత్.. వారసత్వం , అభివృద్ధి అనే థీమ్‌పై ప్రదర్శించబడ్డాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)