పాకిస్తాన్‌ పెంచి పోషించిన ఉగ్రవాదం ఇప్పుడు ఆ దేశ ప్రజలనే కబళిస్తోంది : జైశంకర్‌ !

Telugu Lo Computer
0


పాకిస్తాన్‌ పెంచి పోషించిన ఉగ్రవాదం ఇప్పుడు ఆ దేశ ప్రజలనే కబళిస్తోందని విమర్శించారు. ముంబయిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న జైశంకర్‌ దాయాదిపై విమర్శలు గుప్పించారు. '' మన పొరుగున ఉన్న పాకిస్థాన్‌ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది. అదే ఇప్పుడు వారి పాలిట శాపమైంది. అది క్రమంగా ఆ దేశ రాజకీయాల్లోకీ ప్రవేశిస్తోంది. సీమాంతర ఉగ్రవాదాన్ని అణచివేయాలని భారత్‌ సహా పలుదేశాలు కోరుతున్నాయి.'' అని జైశంకర్‌ తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని, ఈ విషయంలో ఎలాంటి వెనుకబాటుకు తావివ్వకూడదని సూచించారు. పాశ్చాత్య విధానానికి భారత్‌ వ్యతిరేకమైనప్పటికీ వ్యూహాత్మక ప్రయోజనాల కోసం మద్దతిస్తుందని పేర్కొన్నారు. ఆయుధీకరణ విషయంలో భారత్‌ స్వావలంబన పెంచుకోవాల్సిన అవసరముందన్నారు. భారత్‌ను 'విశ్వబంధు'గా అభివర్ణించిన జైశంకర్‌.. స్నేహాన్ని పెంచుకుంటూ, సమస్యలను తగ్గించుకుంటూ ప్రపంచ వేదికపై భారత్‌ ఓ నమ్మకమైన భాగస్వామిగా వ్యవహరిస్తోందని చెప్పారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ముందుకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. పరస్పర గౌరవం, ప్రయోజనాలు, సుహృద్భావ సంబంధాలు అనే మూడు అంశాలే భారత దౌత్య విధానమని స్పష్టం చేశారు. గత పదేళ్లలో వివిధ దేశాలతో జరిగిన ఒప్పందాలు, ప్రపంచ వేదికలపై భారత్‌కు దక్కిన గుర్తింపే అందుకు నిదర్శనమని చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)