ఉగాదికి గద్దర్‌ సినీ అవార్డుల ప్రదానం !

Telugu Lo Computer
0


గాదికి గద్దర్‌ సినీ అవార్డులను ప్రదానం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సచివాలయంలో జరిగిన గద్దర్‌ అవార్డుల కమిటీ సమావేశంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. అవార్డుల ప్రదానోత్సవానికి ఏర్పాట్లు చేసుకోవాలని కమిటీ సభ్యులు, అధికారులకు సూచించారు. సినిమా నిర్మాణంలో హైదరాబాద్‌ను ప్రపంచ గమ్యస్థానంగా మారుస్తామని ఈ సందర్భంగా భట్టి తెలిపారు. అవార్డుల కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి వెల్లడించారు. అవార్డుల పంపిణీ కార్యక్రమాన్ని జాతీయ స్థాయి కార్యక్రమాల తరహాలో నిర్వహించాలని సూచించారు. గత పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన భారాస చిత్ర పరిశ్రమను నిర్లక్ష్యం చేసిందన్నారు. భారాస హయాంలో అవార్డుల పంపిణీ జరగలేదన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో సినిమాల నిర్మాణాన్ని ప్రోత్సహించే అవార్డులను ఏటా అంజేయాలని నిర్ణయించినట్టు భట్టి విక్రమార్క తెలిపారు. తెలుగు భాషలో నిర్మించిన ఉత్తమ చిత్రాలను గుర్తించి, ప్రశంసిస్తూ అవార్డులు అందజేయనున్నారు. జాతీయ సమైక్యత, ఐక్యతను పెంపొందించే సాంస్కృతిక, విద్యా, సామాజిక ఔచిత్యం కలిగిన అత్యున్నత సాంకేతిక నైపుణ్యం, మానవతా విలువలతో కూడిన చిత్రాల నిర్మాణాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో అవార్డులు అందజేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. అవార్డుల కోసం లోగోతో సహా విధివిధానాలు, నియమ నిబంధనలపై కమిటీ చర్చించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)