ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాష ఇంగ్లీష్ : 15వ స్థానంలో తెలుగు !

Telugu Lo Computer
0


ప్రపంచంలో అత్యధికంగా ఇంగ్లీష్ మాట్లాడే వారు మొదటి స్థానంలో ఉన్నారు. హిందీ మూడో స్థానంలో ఉండగా, తెలుగు 15వ స్థానంలో వుంది. ఇంగ్లీష్ మాట్లాడే వారు 113 కోట్ల 20 లక్షలు. ఈ భాష ప్రధానంగా యునైటెడ్ కింగ్‌డమ్‌, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో మాట్లాడతారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాపార, విద్యా రంగాల్లో దీనికి విశేష ప్రాధాన్యం ఉంది. మాండరిన్ చైనీస్ మాట్లాడే వారు 111 కోట్ల 70 లక్షలు. ఈ భాష చైనాలో అత్యధికంగా మాట్లాడుతారు. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో మాట్లాడే మాతృభాష ఇది. హిందీ మాట్లాడే వారు 61 కోట్ల 50 లక్షలు. భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే భాషల్లో ఇది ప్రధానమైనది. హిందీ మన దేశానికి అధికారిక భాషల్లో ఒకటి. ఇది మూడో స్థానంలో ఉంది. స్పానిష్ ఇంగ్లీష్ మాట్లాడే వారు 53 కోట్ల 40 లక్షలు. స్పెయిన్ తో పాటు లాటిన్ అమెరికాలోని చాలా దేశాల్లో ఈ భాషను మాట్లాడతారు.ఇది నాల్గొవ స్థానంలో ఉంది. ఫ్రెంచ్ ని 28 కోట్లు. ఫ్రాన్స్‌తో పాటు కెనడా, బెల్జియం, స్విట్జర్లాండ్ వంటి దేశాల్లో కూడా ఈ భాషను ఉపయోగిస్తారు. ఇది అంతర్జాతీయ సంబంధాలలో ముఖ్యమైన భాష. ఇది ఐదవ స్థానంలో ఉంది. అరబిక్  మాట్లాడే వారు 27 కోట్ల 40 లక్షలు. మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా ప్రాంతాల్లో ఈ భాషను ఎక్కువగా మాట్లాడతారు. ఇది అనేక దేశాల అధికారిక భాష కూడా. ఇది ఆరవ స్థానంలో ఉంది. బెంగాలీ మాట్లాడే వారు 26 కోట్ల 50 లక్షలు. బంగ్లాదేశ్, భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఈ భాషను అధికంగా ఉపయోగిస్తారు. ఇది ఏడో స్థానంలో ఉంది. రష్యన్ మాట్లాడే వారు 25 కోట్ల 80 లక్షలు. రష్యాలో ప్రధానంగా మాట్లాడే భాష ఇది. పూర్వపు సోవియట్ యూనియన్ దేశాల్లో కూడా దీనికి ప్రాధాన్యం ఉంది. ఇది ఎనిమిది స్థానంలో ఉంది. పోర్చుగీస్ మాట్లాడే వారు 23 కోట్ల 40 లక్షలు. పోర్చుగల్‌తో పాటు బ్రెజిల్, అంగోలా, మొజాంబిక్ వంటి దేశాల్లో ఈ భాషను మాట్లాడుతారు. ఇది తొమ్మిదో స్థానంలో ఉంది. ఇండోనేషియన్ మాట్లాడే వారు  19 కోట్ల 90 లక్షలు. ఇండోనేషియా దేశానికి ఇది అధికారిక భాష. ఆగ్నేయాసియా ప్రాంతంలో దీనికి ప్రాముఖ్యత ఉంది. ఇది పడవ స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు మాట్లాడేవారి సంఖ్య 9 కోట్ల 60 లక్షలతో జాబితాలో 15వ స్థానంలో నిలిచింది.

Post a Comment

0Comments

Post a Comment (0)