వచ్చే జూన్ నుంచి కేవైసీ ధ్రువీకరణ కోసం స్వీయ ధ్రువీకరణ సదుపాయాన్ని అమలు చేయబోతోన్నట్లు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. దీని వల్ల ఉద్యోగులు కంపెనీ హెచ్ఆర్ తో పని లేకుండా కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. దీని వల్ల పలువురు ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. చాలా మంది ప్రైవేట్ ఉద్యోగులు కంపెనీ మారుతుంటారు. ఇలా ఉద్యోగం మారిన వారు పీఎఫ్ పోర్టల్ లో కేవైసీ అప్డేట్ చేసుకోవాలంటే.. హెచ్ఆర్ ఒకే చెప్పాలి. లేకుంటే కేవైసీ ఆగిపోతోంది. కొన్ని కంపెనీలు ఉద్యోగులకు సరైన జీతాలు ఇవ్వవు. వారికి పీఎఫ్ చందా కూడా జమ చేయవు. అలాంటి కంపెనీల నుంచి బయటకు వచ్చిన వారు తమ కేవైసీ చేసుకోవాలంటే పాత కంపెనీ హెచ్ అనుమతి ఉండాలి. కానీ చాలా మందికి పాత కంపెనీ హెచ్ తో కమ్యూనికేషన్ ఉండదు. ఉదాహరణకు హైదరాబాద్ లో ఒక కంపెనీ ఉంది. ఇందులో పని చేసేవారికి కంపెనీ సరిగా జీతాలు ఇవ్వలేదు. పీఎఫ్ చందా కూడా జమ చేయలేదు. దీంతో వారంతా బయటకు వచ్చారు. కంపెనీపై కేసు వేశారు. అయితే అప్పటికే వారి పీఎఫ్ ఖాతాలో ఉన్న డబ్బును విత్ డ్రా చేసుకోవాలంటే వారు కేవైసీ చేసుకోవాలి. కానీ పాత కంపెనీ హెచ్ఆర్ అందుకు అనుమతి ఇవ్వలేదు. దీంతో వారంతా ఇబ్బందులు పడుతున్నారు. తమ డబ్బులను ప్రస్తుత ఖాతాలోకి కూడా ట్రాన్స్ ఫర్ చేసుకోలేకపోతున్నారు. జూన్ నుంచి వీరంతా కేవైసీ స్వీయ ధృవీకరణతో లబ్ధి పొందే అవకాశం ఉంది. ఈపీఎఫ్‌వో 3.0 ప్రాజెక్ట్‌లో భాగంగా స్వీయ-ధ్రువీకరణ సదుపాయం కల్పించనుంది. ఈపీఎఫ్‌వో 3.0 సిస్టమ్‌లో అందుబాటులోకి రానున్న మరో ముఖ్యమైన వెసులుబాటు క్లెయిమ్‌కు దరఖాస్తు చేయకుండానే నిధులను ఉపసంహరించుకునే అవకాశం కూడా ఉంది. ఈపీఎఫ్‌వో చందాదారులు కష్టపడి సంపాదించి దాచుకున్న డబ్బును ఆలస్యం, అవాంతరాలు లేకుండా సులభంగా డ్రా చేసుకునేలా అవకాశం కల్పిస్తామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు.
జూన్ నుంచి కేవైసీ ధ్రువీకరణ కోసం స్వీయ ధ్రువీకరణ !
January 17, 2025
0
Tags