18న గ్రూప్-2 'కీ' విడుదల : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్

Telugu Lo Computer
0


తెలంగాణ గ్రూప్-2 ప్రాథమిక కీ జనవరి 18న విడుదల చేయనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఓ ప్రకటనలో వెల్లడించింది. జనవరి 18 నుంచి 22 వరకు అభ్యర్థుల లాగిన్‌లో ప్రాథమిక కీ అభ్యంతరాలను స్వీకరిస్తారు. జనవరి నెల 18 నుంచి 22 వరకు అభ్యర్థుల లాగిన్‌లో ప్రాథమిక కీ అందుబాటులో ఉంటుందని టీజీపీఎస్సీ పేర్కొంది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే అభ్యంతరాలను తెలపాలని సూచించింది. ప్రాథమిక కీ శనివారం నుంచి 22వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామని అధికారులు తెలిపారు. అభ్యంతరాలను కేవలం ఇంగ్లీష్ భాషలోనే తెలపాలని టీజీపీఎస్సీ అధికారులు సూచించారు. అభ్యర్థులు చెప్పదలచుకున్న అభ్యంతరాలకు తప్పనిసరిగా.. ఆ అంశం ఏ పుస్తకంలోనిది? ఆథర్ ఎవరు? ఎడిషన్, పేజీ నంబర్, పబ్లిషర్స్ పేరు లేదా వెబ్‌సైట్ యూఆర్ఎల్‌ను మెన్షన్ చేయాలని చెప్పారు. ఇక అభ్యంతరాలను ఈ మెయిల్ ద్వారానే పంపాలన్నారు. గతేడాది డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్-2 రాతపరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ పరీక్షలు నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా 1368 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరిగాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)