ప్రయాగ్ రాజ్ కు రైళ్లు తాత్కాలికంగా రద్దు !

Telugu Lo Computer
0


మహా కుంభమేళాలో తొక్కిసలాట కారణంగా ప్రయాగ్ రాజ్ కు వెళ్లే రైళ్లను తాత్కాలికంగా రైల్వే శాఖ నిలిపివేసింది. మౌని అమావాస్య కావడంతో ఒక్కసారిగా మహాకుంభమేళాకు పది కోట్ల మంది భక్తులు వచ్చారని అంచనా వేస్తున్నారు. అయితే సంగం సమీపంలో ఈ తొక్కిసలాట జరిగి దాదాపు ఇరవై మంది మరణించడంతో ఇంకా భక్తులు అక్కడకు చేరుకోకుండా భక్తుల రద్దీని నియంత్రించేందుకు రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. కొన్ని రైళ్లను మధ్యలోనే నిలిపేశారు. రికార్డు స్థాయిలో ఇప్పటికే మహా కుంభమేళాలో రికార్డు స్థాయిలో భక్తులు చేరుకోవడంతో రైళ్లలో మరింత మంది వస్తే మరింత ఇబ్బంది ఎదురవుతుందని భావించి రైళ్లను నిలిపి వేసింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)