వాట్సాప్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో ప్రైవేట్ సందేశాల భద్రత గురించి చాలా కాలంగా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కానీ ఇటివల మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వాట్సాప్ గోప్యత గురించి మరిన్ని ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్షన్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో, గోప్యతపై దీని ప్రభావం ఎలా ఉంటుందో ఆయన వివరించారు. మార్క్ జుకర్‌బర్గ్ శనివారం ది జో రోగన్ ఎక్స్‌పీరియన్స్" పాడ్‌కాస్ట్‌లో దీనికి సంబంధించిన పలు విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా వాట్సాప్‌కు బలమైన ఎన్‌క్రిప్షన్ టెక్నాలజీ ఉన్నప్పటికీ, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వంటి ప్రభుత్వ సంస్థలు వినియోగదారుల సందేశాలను యాక్సెస్ చేయగలవని అన్నారు. ఈ ఏజెన్సీకి ఆ పరికరం భౌతికంగా లభించినప్పుడే ఇది సాధ్యమవుతుందని జుకర్‌బర్గ్ స్పష్టం చేశారు. ఏదైనా పరికరం భద్రతలో చివరి భాగం భౌతిక ప్రాప్యత అని మార్క్ జుకర్‌బర్గ్ ఈ ప్రకటనలో అన్నారు. ఎవరైనా మీ పరికరాన్ని యాక్సెస్ చేస్తే, దానిని హ్యాక్ చేయడం సులభం అవుతుందని ఆయన వివరించారు. ఎఫ్ బీ ఐ ఎవరినైనా అరెస్టు చేసినప్పుడు, వారు వారి ఫోన్‌ను స్వాధీనం చేసుకుని, దానిలో ఉన్న డేటాను పొందుతారని జుకర్‌బర్గ్ ఒక ఉదాహరణ ఇచ్చారు. ఈ క్రమంలో మీ పరికరం భౌతిక భద్రత చాలా ముఖ్యమైనదని జుకర్‌బర్గ్ ప్రస్తావించారు. ఎవరైనా మీ పరికరాన్ని యాక్సెస్ చేస్తే దానిని హ్యాక్ చేయవచ్చని అన్నారు. జుకర్‌బర్గ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం డేటా భద్రతా ఆందోళనలను తెచ్చిపెట్టాయి. ఆయన వివరించినట్టు మీ పరికరం హ్యాక్ అయిన తర్వాత మీ సమాచారం వారికి వెళ్లిపోతుంది. అంటే మీరు మీ మొబైల్ ఫోన్‌ను లేదా ఇతర పరికరాన్ని కంగారుగా వదిలేసినపుడు, అది మరొకరి చేతికి అందితే, ఆ పరికరం ద్వారా మీరు పంపిన సందేశాల రక్షణ కోల్పోతారు. ఈ క్రమంలో మీరు అనుమానాస్పద వ్యక్తులకు మీ డివైస్‌ను ఇవ్వకూడదు. అలాగే మీ ఫోన్లలో ఎప్పటికప్పుడూ సమాచారాన్ని డిలీట్ చేస్తూ ఉండాలి. ముఖ్యమైన ఫైల్స్ ఉంటే ల్యాప్‌ట్యాప్ వంటి పరికరాల్లో సేవ్ చేసుకోవాలి. ఎందుకంటే మీ ఫోన్ ఎవరైనా హ్యాక్ చేసినా లేదా ఏజెన్సీకి చిక్కినా మీ సమాచారాన్ని రాబట్టే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం వాట్సాప్ ప్రపంచంలోనే అత్యంత విస్తృతంగా ఉపయోగించే ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్. దీనికి 2.95 బిలియన్లకు పైగా యాక్టివ్ యూజర్లు ఉన్నారు. దీని భద్రతా లక్షణాలలో ముఖ్యంగా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ చాలా ప్రసిద్ధి చెందింది. ఇది గోప్యతా వినియోగదారుల ప్రైవేట్ చాట్‌లను రక్షిస్తుంది.
మార్క్ జుకర్‌బర్గ్ వ్యాఖ్యలు : వాట్సాప్ గోప్యతపై మరిన్ని ప్రశ్నలు !
January 15, 2025
0
Tags