* రెండు టేబుల్ స్పూన్ల తాజా టమాటా గుజ్జులో కొద్దిగా తేనె కలపాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి, వేళ్లతో గుండ్రంగా 8-10 నిమిషాల పాటు మర్దన చేయాలి. ఇలా చేస్తే చర్మం పోషకాలను గ్రహిస్తుంది, మురికి, జిడ్డు తొలగిపోతాయి. మర్దన చేసిన తర్వాత, ఒక దూది ఉండతో ముఖాన్ని తుడవాలి
* ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండిలో టమాటా గుజ్జు కలపాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి పట్టించి 4-5 నిమిషాలు మర్దన చేయాలి. ఈ స్క్రబ్ చర్మంపై పేరుకుపోయిన మృత కణాలను తొలగిస్తుంది, చర్మాన్ని మృదువుగా, తాజాగా మారుస్తుంది. స్క్రబ్ చేసిన తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి.
* ఒక టేబుల్ స్పూన్ టమాటా రసంలో ఒక టేబుల్ స్పూన్ పాలు కలపండి. దీన్ని ముఖానికి పట్టించి 10-15 నిమిషాల పాటు మర్దన చేయండి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, మీ చర్మాన్ని ఆరోగ్యంగా, తేజోవంతంగా కనిపించేలా చేస్తుంది.
* టమాటా గుజ్జు, పాలు, చిటికెడు కాఫీ పొడి సమాన మొత్తంలో తీసుకొని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు సమానంగా పట్టించి, 20-30 నిమిషాలు ఆరనివ్వాలి. పూర్తిగా ఆరిన తర్వాత, చల్లటి నీటితో కడిగేయాలి. చివరగా, చర్మాన్ని తేమగా ఉంచడానికి మాయిశ్చరైజర్ రాయాలి.
టమాటాల్లో విటమిన్ C, విటమిన్ E, బీటా కెరోటిన్, లైకోపీన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి, మొండి మచ్చలను తగ్గిస్తాయి, ఎర్రగా మారిన చర్మాన్ని శాంతపరుస్తాయి. అంతేకాదు, టమాటాలకు నేచురల్ బ్లీచింగ్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. ఇవి చర్మపు రంగును మెరుగుపరుస్తాయి, క్రమంగా టానింగ్‌ను తగ్గిస్తాయి. టమాటా ఫేషియల్ రెగ్యులర్‌గా అప్లై చేస్తే చర్మం మృదువుగా, మెరిసేలా తయారవుతుంది. టమాటాలలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమలను తగ్గిస్తాయి, వాటిని రాకుండా ఆపుతాయి. రెగ్యులర్‌గా టమాటాలు వాడితే చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి, చర్మం నునుపుగా కనిపిస్తుంది. ఇవి చర్మ సహజ నూనెలను బ్యాలెన్స్ చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి, కాబట్టి జిడ్డు చర్మం ఉన్నవారికి ఇవి మంచివి.