బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య భారీ ఎదురుకాల్పులు : నలుగురు మావోయిస్టులు మృతి !

Telugu Lo Computer
0


త్తీస్ ఘడ్ లోని బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య భారీ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్ కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సౌత్ బస్తర్ ఏరియాలో మావోయిస్టులు రహస్య సమావేశం ఏర్పాటు చేశారని వచ్చిన సమాచారంతో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసులను గమనించిన మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు ప్రారంభించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)