పెన్‌-పేపర్‌ పద్ధతిలో నీట్‌ యూజీ-2025 పరీక్ష !

Telugu Lo Computer
0


వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్‌ యూజీ పరీక్షలు పెన్‌-పేపర్‌ పద్ధతిలోనే నిర్వహించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. దేశమంతా ఒకే రోజు, ఒకే షిఫ్టులో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. కేంద్ర విద్య, ఆరోగ్యశాఖల మధ్య సుదీర్ఘ సంప్రదింపుల అనంతరం చివరకు ఓఎంఆర్‌ పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపింది. ''నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ నిర్ణయం ప్రకారం.. నీట్‌ యూజీ పరీక్ష పెన్‌, పేపర్‌ పద్ధతిలో నిర్వహిస్తాం. ఒకేరోజు, ఒకే షిఫ్టులో ఈ పరీక్ష ఉంటుంది'' అని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ అధికారి వెల్లడించారు. దేశంలో అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యే పరీక్షగా నీట్‌ యూజీ నిలుస్తోంది. 2024లో 24లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. జేఈఈ మెయిన్‌ తరహాలోనే ఈసారి (2025) కూడా నీట్‌ యూజీని ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించాలని ఎన్‌టీఏ భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇస్రో మాజీ ఛైర్మన్‌ కస్తూరి రంగన్‌ ఛైర్మన్‌గా నియమించిన నిపుణుల కమిటీ సైతం ఆన్‌లైన్‌ విధానంలో నీట్‌ నిర్వహించాలని సిఫారసు చేసింది. అయితే, తాజాగా కేంద్ర విద్య, ఆరోగ్యశాఖలు జరిపిన విస్తృత చర్చల్లో ఓఎంఆర్‌ పద్ధతికే మొగ్గు చూపుతూ నిర్ణయం తీసుకున్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)