ఎదురు కాల్పుల్లో మావోయిస్టు రాష్ట్ర కమిటీ కీలక నేత బడే చొక్కారావు మృతి

Telugu Lo Computer
0


తెలంగాణ మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈనెల 16న ఛత్తీస్ గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పూజారి కాంకేర్-మారేడుబాక అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ మృతిచెందారు. రెండ్రోజుల క్రితం మావోలు, భద్రతా దళాలకు మధ్య జరిగిన భీకర ఎదురుకాల్పు్ల్లో చొక్కారావుతోపాటు 18 మంది నక్సల్స్ మృతిచెందినట్లు మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. ములుగు జిల్లా కాల్వపల్లి గ్రామానికి చెందిన బడే చొక్కారావు.. మావో సిద్ధాంతాలకు ఆకర్షితుడై పార్టీలో చేరాడు. 30 ఏళ్లుగా ఆయన నక్సల్ ఉద్యమంలో వివిధ హోదాల్లో పని చేశారు. కరోనాతో తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా ఉన్న హరిభూషణ్ ఛత్తీస్ గడ్ రాష్ట్రంలో 21 జూన్ 2021 లో మృతిచెందగా కేంద్ర కమిటీ బడే చొక్కారావుకు ఆ బాధ్యతలు అప్పగించింది. ఎన్నో ఏళ్లుగా పలు రాష్ట్రాలకు ఆయన మోస్ట్ వాంటెడ్ గా ఉన్నారు. ఛత్తీస్ గఢ్ రాష్ట్ర ప్రభుత్వం చొక్కారావుపై రూ.50 లక్షల రివార్డు ప్రకటించగా, తెలంగాణ రాష్ట్రం సైతం రూ.25 లక్షల రివార్డు ప్రకటించింది. కాగా, ప్రస్తుతం ఎదురుకాల్పుల్లో ఆయన మృతి చెందారు. కాగా బడే ఎల్లయ్య- బడే బతుకమ్మల చిన్న కుమారుడు బడే చొక్కా రావు. తండ్రి చదువుకునే వయసులోనే మృతి చెందాడు. తల్లి బతుకమ్మ మాత్రం గుడిసెలోనే ఉంటూ వృద్ధాప్యంలో ఇబ్బంది పడుతుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)