ఉత్తరప్రదేశ్ లోని ఘాజీపూర్ జిల్లాలో మహాకుంభమేళా భక్తులతో వెళ్తున్న వాహనాన్ని ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం గోరఖ్ పూర్ కు చెందిన కొందరు భక్తులు ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించి తిరుగు పయనమయ్యారు. వారణాసి - ఘాజీపూర్ రోడ్డులోని నంద్గంజ్ పోలీస్ స్టేషన్ సమీపంలో గల ఉస్మి కలా మలుపు వద్దకు రాగానే వీరి వాహనాన్ని ఓ ట్రక్కు అదుపుతప్పి ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటన సమయంలో 20 మంది భక్తులు వాహనంలో ఉన్నట్లు తెలిసింది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కుంభమేళా భక్తులతో వెళ్తున్న వాహనాన్ని ట్రక్కు ఢీ కొట్టిన ఘటనలో ఆరుగురు మృతి
January 31, 2025
0
Tags